భారతదేశం, డిసెంబర్ 12 -- ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఇందులోనూ థ్రిల్లర్లది మరో రేంజ్. ఇప్పుడు అలాంటి మరో మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. మమ్ముట్టి హీరోగా నటించిన 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. థియేటర్లలో రిలీజైన 10 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది.

మమ్ముట్టి హీరోగా యాక్ట్ చేసిన మలయాళ థ్రిల్లర్ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఇది ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అనౌన్స్ మెంట్ రానే వచ్చింది. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా డిసెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా 10 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. ఇది 2025 జనవరి 2...