భారతదేశం, జనవరి 13 -- భారతదేశంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న '10-నిమిషాల డెలివరీ' సంస్కృతిలో త్వరలో పెను మార్పులు రాబోతున్నాయి. వినియోగదారులకు క్షణాల్లో సరుకులు అందించే క్విక్ కామర్స్ సంస్థలైన బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలు తమ డెలివరీ వ్యూహాన్ని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా సూచించింది. ముఖ్యంగా డెలివరీ భాగస్వాముల (గిగ్ వర్కర్ల) భద్రత, వారి సంక్షేమమే ప్రధాన అజెండాగా కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల క్విక్ కామర్స్ రంగ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా.. డెలివరీ సమయం విషయంలో కంపెనీలు విధిస్తున్న నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇది వారి భద్ర...