భారతదేశం, మార్చి 30 -- ఈ మధ్య కాలంలో 30ఏళ్లకే సంతాన సమస్యలు వస్తున్నాయి. చాలా మంది ఫర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరిగుతున్నారు. కానీ జర్మనీకి చెందిన ఒక 66ఏళ్ల వృద్ధురాలు, ఆ వయస్సులోనూ గర్భం దాల్చి, 10వ బిడ్డకు జన్మనిచ్చింది! ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

జర్మనీకి చెందిన చరిత్రకారిణి అలెగ్జాండ్రా హిల్డెబ్రాండ్ (66) బెర్లిన్​లోని చెక్ పాయింట్ చార్లీ వద్ద వాల్ మ్యూజియం డైరక్టర్​గా పనిచేస్తున్నారు. హిల్డెబ్రాండ్​ మార్చ్​ 19న బెర్లిన్​లోని చారిట్ ఆసుపత్రిలో తన నవజాత శిశువు ఫిలిప్​కు స్వాగతం పలికింది. సిజేరియన్ ద్వారా ప్రసవించిన శిశువు ఏడు పౌండ్ల 13 ఔన్సుల బరువు ఉంది. వైద్యపరమైన జాగ్రత్తల కారణంగా, పుట్టిన వెంటనే బిడ్డ ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి ఇంక్యుబేటర్​లో పెట్టినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

హిల్డెబ్రాండ్ మాతృత్వ ప...