భారతదేశం, మే 5 -- నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఎంత ఎక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు సంతృప్తి చెందడం లేదు. 600కి 590 వచ్చినా.. మిగిలిన 10 మార్కులు ఏమయ్యాయి? అని అడిగే పరిస్థితి ఇప్పుడు ఉంది. అలాంటిది ఇక పిల్లలు కీలక ఎగ్జామ్స్​లో ఫెయిల్​ అయితే! తల్లిదండ్రుల కోపానికి బలవ్వాల్సిందే. కానీ కర్ణాటక 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఫెయిల్​ అయిన ఓ విద్యార్థి జీవితంలో ఇలా జరగలేదు. అతని తల్లిదండ్రులు తిట్టడం, కొట్టడం కాదు కదా.. తమ పిల్లాడు ఫెయిల్​ అయ్యాడంటూ సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. అవును మీరు విన్నది నిజమే! అసలేం జరిగిందంటే..

కర్ణాటక బగల్​కోట్​లో బసవేశ్వర ఇంగ్లీష్​ మీడియం స్కూల్​కు చెందిన అభిషేక్​ చోలచగుడ్డ అనే 10వ తరగతి విద్యార్థి.. ఈ ఏడాది బోర్డు పరీక్షలు రాశాడు. ఇటీవలే ఫలితాలు వెలువడ్డాయి. ఏకంగా 6 సబ్జెక్టుల్లో ఫెయిల్​ అయ్యాడు! 600 మార్క...