భారతదేశం, జూన్ 29 -- ఇప్పుడు ఉద్యోగం చేస్తూ, జీతం సంపాదిస్తున్న దాదాపు అందరి దగ్గర క్రెడిట్​ కార్డులు ఉంటున్నాయి. అయితే, క్రెడిట్ కార్డ్ పొందడం చాలా ఈజీనే, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం అసలు సమస్య. మరీ ముఖ్యంగా కొన్ని కార్డులు అధిక వార్షిక రుసుములను వసూలు చేస్తాయి. ఇది కార్డు అందించే ప్రయోజనాలను తగ్గించేస్తుంది. మీకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. మీ క్రెడిట్ కార్డ్ వాడకం తక్కువగా లేదా అప్పుడప్పుడు మాత్రమే ఉంటే, వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డులను ఎంచుకోవడం మంచిది.

ఇక్కడ, యాన్యువల్​ ఫీజ్​ లేని కొన్ని క్రెడిట్ కార్డ్​ల వివరాలు అందిస్తున్నాం. వీటిలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అందించే కార్డులు ఉన్నాయి.

ఈ కార్డులు అందించే ఆఫర్లు చాలా ప్రాథమికమైనవే అయినప్పటికీ, యాన్యువల్​ ఫీజ్​ లేకపోవడం అనేది అవి అ...