భారతదేశం, ఏప్రిల్ 17 -- ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) లోని రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఈ సూర్య తిలక్ శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం 12. 15 నిమిషాలకు సూర్యకిరణం లేదా సూర్య తిలకం రామ్ లల్లా విగ్రహం నుదుటిపై ప్రకాశిస్తుంది.

శ్రీరామ నవమి రోజు అయోధ్యలో గర్భాలయం (Ayodhya Ram Mandir) లోని రామ్ లల్లాపై సూర్యకిరణాలు పడేలా సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ రూర్కీ శాస్త్రవేత్తలు ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రధాని మోదీ (PM Modi) సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. కోణార్క్ దేవాలయంలో మాదిరిగా అయోధ్య రామాలయంలో, ప్రతీ శ్రీరామ నవమి రోజు కూడా బాల రాముడి విగ్రహంపై సూర్య కిరణాలు పడేలా చూడాలని ప్రధాని మోదీ సూచించారు. దాంతో సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ రూర్కీ (CSIR-CBRI Roorkee) శాస్త్రవేత్తలు రంగంల...