భారతదేశం, జూలై 11 -- నాగ్‌పూర్‌: "మీకు 75 ఏళ్లు వస్తే, ఇక ఆగిపోయి ఇతరులకు అవకాశం ఇవ్వాలి" అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధిపతి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ సెప్టెంబర్‌లో 75వ పడిలోకి అడుగుపెట్టనున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయా అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

నాగ్‌పూర్‌లో దివంగత ఆరెస్సెస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లేకు అంకితం చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, "మీకు 75 ఏళ్లు వస్తే, ఇక ఆగిపోయి ఇతరులకు అవకాశం ఇవ్వాలి" అని అన్నారు. మోరోపంత్ పింగ్లే స్వభావం చాలా హాస్యభరితమైనదని భగవత్ గుర్తు చేసుకున్నారు. "మోరోపంత్ పింగ్లే ఒకసారి మాట్లాడుతూ, 75 ఏళ్లు నిండిన తర్వాత మీకు శాలువాతో సత్కారం లభిస్తే, దాని అర్థం మీరు ఇక ఆగిపోవాలి, మీరు వృద్ధులు; ప...