Telangana,delhi, జూలై 23 -- బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో తెలంగాణలో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కృత‌నిశ్చ‌యంతో ఉన్నామ‌ని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. హైకోర్టు సైతం 90 రోజుల్లో (సెప్టెంబ‌రు నెలాఖ‌రులోగా) స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, 30 రోజుల్లో (జులై నెలాఖ‌రులోగా) రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయాల‌ని ఆదేశించింద‌న్నారు.

ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. బీసీల‌కు విద్యా, ఉపాధి రంగాల్లో రిజ‌ర్వేష‌న్లు, స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తెలంగాణ శాస‌న‌స‌భ పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లుల‌ను ఆమోదించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం తాత్సారం చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రెండు బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్త...