Prakasham,andhrapradesh, జూలై 4 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. మార్కాపురంలో రూ.1290 కోట్ల విలువైన తాగు నీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. చిన్నతనంలో రెండేళ్లపాటు తాను ప్రకాశం జిల్లాలో ఉన్నానని గుర్తు చేశారు. అప్పటి నుండి ఇప్పటికీ తాగు నీటి సమస్య ఉందన్నారు. ఫ్లోరైడ్ సమస్యతో మోకాళ్ళు, వెన్నెముకలు ఒంగిపోయే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు.

"గత ప్రభుత్వం మీకు ఏం చేసింది ఎలా ప్రవర్తించారో మీకు తెలుసు ప్రకాశం జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకు 4000 కోట్ల రూపాయలు కావాలి. వాళ్ళు రాష్ట్రంపైన లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు కానీ మనకొక ప్రాజెక్టు తేలేకపోయారు. గత పాలకులు మళ్ళీ రౌడీయిజం, గుండాగర్ది చేసే భావనలోనే ఉన్నారు. వీటికి భయపడితే మనం రాజకీయాల్లోకి వస్తామా! 2029 లో వస్తే మీ అంతు చూస్తా...