భారతదేశం, జూన్ 23 -- ఎన్ఆర్ఐ దంపతులకు హైదరాబాద్‌లో చేదు అనుభవం! 2010లో హైదరాబాద్‌లో ఒక ఎన్ఆర్ఐ దంపతులు చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి నిరాశపరిచే లాభాలతో ముగిసింది. ఆస్తిని అధిక ధరకు విక్రయించినప్పటికీ, అమెరికన్ డాలర్ల పరంగా వారి వార్షిక రాబడి 15 సంవత్సరాల్లో కేవలం 0.5% మాత్రమే ఉందని లెక్కించారు. ఇది వారి అంచనాల కంటే చాలా తక్కువ.

రియల్​ ఎస్టేట్​పై ఫోకస్​ చేసిన ఈ ఎన్​ఆర్​ఐ దంపతులు హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోని మంత్రీ సెలెస్టియా ప్రాజెక్ట్‌లో 1,198 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 3బీహెచ్​కే అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. వారు 2010లో ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. తొమ్మిది సంవత్సరాలు ఈఎంఐల ద్వారా బిల్డర్‌కు వాయిదాలలో డబ్బులు చెల్లించారు. 2019 నాటికి, వారు డెవలపర్‌కు రూ.59.34 లక్షలు చెల్లించారు. అదనంగా, వుడ్​ వర్క్​, మరమ్మతుల క...