భారతదేశం, నవంబర్ 16 -- రియల్ ఎస్టేట్ ఆస్తులకు లక్కీ లాటరీలు నిర్వహించి ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.నరసింహ హెచ్చరించారు. అనేక మంది రియల్టర్లు, ఆస్తి యజమానులు ఇళ్ళు, ఓపెన్ ప్లాట్ల కోసం ఒక ధర పెట్టి లక్కీ డ్రాల కోసం కూపన్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి లక్కీ డ్రాలతో మోసం చేసేవారికి హెచ్చరికలు జారీ చేశారు.

"1000 కట్టు, ఫ్లాట్ పట్టు" వంటి ఆకర్షణీయమైన లైన్స్ ఉపయోగించి జిల్లాలో కొంతమంది రియల్టర్లు ఈ లాటరీలను నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎస్పీ నరసింహ చెప్పారు. ఇది చట్టం ప్రకారం నేరమన్నారు. కూపన్లను విక్రయించడానికి సోషల్ మీడియాలో యూపీఐ స్కాన్ కోడ్‌లను కూడా షేర్ చేస్తున్నారన్నారు. దీనివల్ల ఆర్థిక మోసానికి అవకాశం ఏర్పడుతుందని ఎస్పీ చెప్పారు. పోలీసులు కొంతమంది నిర్వాహకులను గుర...