భారతదేశం, మే 1 -- ఇండియన్ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 27వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి హిమాన్షి నర్వాల్ శాంతి, ఐక్యత కోసం హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన 26 మందిలో వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు.

గురుగ్రామ్ కు చెందిన పీహెచ్ డీ స్కాలర్ హిమాన్షి నర్వాల్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ తన భర్త కోసం యావత్ దేశం ప్రార్థించాలని, ఆయన ఎక్కడున్నా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి కోపాన్ని ఏ సామాజికవర్గం పైనా రుద్దవద్దని ఆమె నొక్కి చెప్పారు. ఏ సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేయడం తమకు ఇష్టం లేదని అన్నారు. ముస్లింలు, కశ్మీరీలకు వ్యతిరేకంగా ప్రజలు వెళ్లడం తమకు ఇష్టం లేదన్నారు. 'మాకు శాంతి కావాలి. శాంతి మాత్రమే కావాలి. మ...