భారతదేశం, జూన్ 20 -- పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్య తన భర్త అనుమతి తీసుకుని అతని సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రేవతి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ .ఆనంద్ వెంకటేశ్ తాజా ఉత్తర్వుల్లో ఈ మేరకు తీర్పు వెలువరించారు.

దరఖాస్తులో తన భర్త సంతకం ఉండాలని బలవంతం చేయకుండా గడువులోగా కొత్త పాస్ పోర్టు జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని రేవతి తన పిటిషన్ లో కోరారు. తనకు 2023లో వివాహం జరిగిందని, ఆ తరువాత తామిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయని, దీంతో తన భర్త వివాహాన్ని రద్దు చేయాలంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని పిటిషనర్ రేవతి కోర్టుకు తెలిపారు. ఆ విడాకుల పిటిషన్ పెండింగ్ లో ఉంది.

పిటిషనర్ రేవతి ఈ ఏడాది ఏప్రిల్ లో చెన్నై నగరంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో పాస్ పోర్...