భారతదేశం, మే 8 -- భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా.. పాకిస్థాన్ లోని బహవల్ పూర్ లోని జైషే ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిపిన క్షిపణి దాడిలో హతమైన వారిలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు 14 మంది వరకు ఉన్నారు. ఈ విషయాన్ని మౌలానా మసూద్ అజహర్ అంగీకరించాడు. భారత్ దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు మరణించారని అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ ప్రకటించాడు. వారిలో తాను కూడా ఉండి ఉంటే బావుండేదని వ్యాఖ్యానించాడు.

బహవల్పూర్లోని జామియా మసీదు సుభాన్ అల్లాపై జరిగిన దాడిలో మరణించిన వారిలో జైషే మహ్మద్ చీఫ్ అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మరో మేనకోడలు, అతని కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని మసూద్ తన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ దాడిలో తన సన్...