భారతదేశం, జూలై 24 -- అమెరికా కంపెనీలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంపెనీల తీరు వల్ల అమెరికన్లలో అపనమ్మకం, ద్రోహానికి గురయ్యామన్న భావన నెలకొన్నాయన్నారు. ఆ పరిస్థితి మారాలని వ్యాఖ్యానించారు.

ఒకవైపు అమెరికాలో స్వేచ్ఛ యొక్క ప్రయోజనాలను పొందుతూ మరోవైపు చైనాలో కర్మాగారాలను నిర్మిస్తున్నాయని, భారత్ నుంచి ఉద్యోగులను నియమించుకుంటున్నాయని అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వాషింగ్టన్ లో జరిగిన ఏఐ సమ్మిట్ లో ట్రంప్.. తన హయాంలో ఆ రోజులు ముగిశాయని అన్నారు. "చాలా కాలం పాటు, అమెరికా టెక్ పరిశ్రమ చాలా వరకు రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించింది. ఇది మిలియన్ల మంది అమెరికన్లకు అపనమ్మకం మరియు ద్రోహం కలిగించింది" అని ట్రంప్ ఈ సదస్సులో ప్రసంగించారు. అమెరికాకు చెందిన...