భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పలువురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పహల్గామ్ లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది పర్యాటకులు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. టూరిస్టులపై కాల్పులు జరిపిన తరువాత ఉగ్రవాదులు.. బాధితులతో.. వెళ్లి ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాలని అన్నారని ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానిక పౌరులు క్షతగాత్రులకు సహాయం చేశారు. కశ్మీర్ పర్యటనకు వచ్చిన హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ ఈ ఉగ్రదాడిలో మృతి చెందాడు. అతని భార్య పల్లవి ఈ దాడి గురించి వివరిస్తూ, కాల్పులు జరిపిన అనంతర...