భారతదేశం, ఏప్రిల్ 26 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ భారత కమ్యూనిటీ సభ్యులు శుక్రవారం లండన్ లోని పాక్ హైకమిషన్ ఎదుట ఆందోళన చేస్తుండగా, ఆ ఆందోళనకారులను ఉద్దేశించి పాక్ ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి బెదిరింపు సైగలు చేస్తూ కెమెరాకు చిక్కారు. చేతిలో భారతీయ వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ పోస్టర్ ను చేతిలో పట్టుకుని లండన్ లోని హైకమిషన్ లో పాక్ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ ఈ బెదిరింపులకు దిగారు.

లండన్ లోని హైకమిషన్ లో పాక్ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ భారతదేశానికి చెందిన నిరసనకారులను బహిరంగంగా గొంతు కోస్తామని బెదిరిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ 500 మందికి పైగా భారతీయులు శుక్రవారం లండన్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎద...