భారతదేశం, ఏప్రిల్ 23 -- దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో కశ్మీరీ పోనీ రైడ్ ఆపరేటర్ చేసిన సాహసోపేత చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పహల్గామ్ లో కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి బైసరన్ మైదానానికి పర్యాటకులను తన గుర్రంపై తీసుకువెళ్లే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మంగళవారం నాటి ఉగ్రవాదుల దాడి సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. కాల్పులు జరుపుతున్న ఒక ఉగ్రవాది నుంచి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు ఉగ్రవాదుల కాల్పుల్లో అక్కడికక్కడే మరణించాడు.

సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా రెగ్యులర్ గా తన గుర్రంపై కారు పార్కింగ్ నుండి బైసరన్ మైదానానికి పర్యాటకులను తీసుకువెళ్లేవాడు. అదే అతడి జీవనాధారం. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కు వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి అతన...