భారతదేశం, ఏప్రిల్ 16 -- 2025 లో అయితే, మీరు ఎలాంటి సంస్థను స్థాపించేవారు? అన్న ఒక యూజర్ ప్రశ్నకు ఆన్ లైన్ బ్రోకరేజీ ప్లాట్ ఫామ్ జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ బుధవారం ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 2025లో అయితే, జీరోధాను స్థాపించి ఉండేవాళ్లం కాదన్నారు. తన ట్రేడింగ్ ప్రశ్నోత్తరాల ప్లాట్ ఫామ్ లో ఒక పోస్ట్ కు సమాధానమిస్తూ ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం మార్కెట్లు బ్రోకరేజీ సంస్థలతో రద్దీగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో, అదే తరహా సేవలను అందించే మరో బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు.

గత 10 సంవత్సరాలలో తమ సంస్థ జీరోధా బాగా అభివృద్ధి చెందిందని కామత్ అన్నారు. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజే.. అప్పటికే మార్కెట్లో ఉన్న "ఉత్తమమైన" ప్రత్యర్థిని ఓడించడానికి ప్రయత్నించడంలో అర్థం లేదని కామత్ వ్యాఖ్యానించారు. ప్రస...