భారతదేశం, జూలై 24 -- రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం కర్ణాటక హైకోర్టును మందలించింది.

నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఇది "విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయడం" అని వ్యాఖ్యానించింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తుల మాదిరిగా బెయిల్ ఇచ్చే సమయంలోనే దోషి అనో లేదా నిర్దోషి అనో తీర్పు ఇచ్చే తప్పు తాము చేయబోమని పేర్కొంది. టుడు దర్శన్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో ఉపయోగించిన భాషపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. 'ఏ...