భారతదేశం, ఏప్రిల్ 25 -- న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు హితవు పలికింది. స్వాతంత్య్ర సమరయోధుడు సావర్కర్ ను బ్రిటీష్ వారి సేవకుడిగా పేర్కొంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బాధ్యతారాహిత్య వ్యాఖ్యలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఆ వ్యాఖ్యలపై లక్నో కోర్టు రాహుల్ గాంధీకి జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది.

2022 నవంబర్ లో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ''ఎలాంటి చరిత్ర, భౌగోళిక పరిస్థితులు తెలుసుకోకుండా స్వాతంత్య్ర...