భారతదేశం, మే 8 -- ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైనిక చర్య గురించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజకీయ పార్టీల నాయకులకు వివరించారు. ఆపరేషన్ సిందూర్ అనేది "కొనసాగుతున్న ఆపరేషన్" అని స్పష్టం చేశారు. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులకు సంబంధించిన వివరాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ను ప్రస్తుతానికి పంచుకోలేమని చెప్పారు. ఈ భేటీకి వివిధ పార్టీల నాయకులతో పాటు హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు.

ఆపరేషన్ సిందూర్ కోడ్ నేమ్ తో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది చోట్ల జరిగిన ఆపరేషన్ గురించి ప్రధాన రా...