భారతదేశం, ఏప్రిల్ 25 -- 26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన చర్యలు భారత్, పాక్ ల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉందని, ఈ విషయంపై ప్రపంచం ఆందోళన చెందాలని ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్ తో అన్నారు.

ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, ఆర్థికంగా సపోర్ట్ చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్తాన్ కు సుదీర్ఘ చరిత్ర ఉందని మీరు అంగీకరిస్తారా అని స్కై న్యూస్ జర్నలిస్ట్ యాల్దా హకీమ్ అడిగిన ప్రశ్నకు ఖవాజా ఆసిఫ్ స్పష్టమైన సమాధానమిచ్చారు. "మేము సుమారు 3 దశాబ్దాలుగా అమెరికా కోసం ఈ నీచమైన పని చేస్తున్నాము... బ్రిటన్ సహా పశ్చిమ దేశాలు కూడా ఇందులో ఉన్నాయి.. అది పొరపాటు. ...