Telangana,hyderabad, జూలై 3 -- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స‌చివాల‌యంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించిన ఆయన. అనర్హుల‌ని తేలితే ఇంటి నిర్మాణం మ‌ధ్య‌లో ఉన్నా కూడా ర‌ద్దు చేయ‌డానికి వెనుకాడ వద్దని అధికారులను ఆదేశించారు. ప్ర‌తి ఇల్లు అర్హుల‌కే అందాలన్నారు.

ప్ర‌భుత్వం ఉచితంగా అందిస్తున్న ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ ట‌న్నుల ఇసుక అందేలా ప‌ర్య‌వేక్షించాలని మంత్రి పొంగులేటి సూచించారు. అలాగే ఇంటి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స్టీల్‌, సిమెంట్ ఇటుక‌ల కోసం మండ‌ల స్ధాయిలో ధ‌ర‌ల‌ నియంత్ర‌ణ క‌మిటీల‌ను ఏర్పాటుకు ప్ర‌భుత్వం ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగిందని గుర్తు చేశారు. వీలైనంత త్వ‌రిత‌గ‌తిన ఈ క‌మిటీలు ఏర్పాటయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్ర‌భ...