Hyderabad, ఆగస్టు 11 -- ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. బ్రహ్మాస్త్రం సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసింది.

ఆగస్ట్ 14న వార్ 2 రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్ట్ 10) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. "నందమూరి తారక రామారావు గారితో నాది 25 ఏళ్ల ప్రయాణం. హృతిక్ రోషన్ గారు నటించిన 'కహోనా ప్యార్ హై' మూవీని చూసి థియేటర్లలో చప్పట్లు కొట్టాను. అయాన్ తీసిన 'యే దివానీ హై జవానీ' మూవీని డజను సార్లు చూశాను. నాగవంశీ నా కుటుంబ సభ్యుడు. ఇలాంటి వారందరినీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉ...