భారతదేశం, జూలై 31 -- "హస్తప్రయోగం కోసం ఆఫీస్​లో 30 నిమిషాల పాటు బ్రేక్​ తీసుకోండి", "మీకోసం ప్రైవేట్​ రూమ్​ కూడా ఏర్పాటు చేశాము".. ఇలాంటి వింత వర్క్​ప్లేస్​ పాలసీల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? స్వీడన్​కి చెందిన ఒక మహిళ తన కంపెనీలోని ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటునే ఆఫర్​ చేస్తోంది! అసలు ఏంటి ఆ కంపెనీ? ఎందుకు ఇలా చేస్తోంది?

స్వీడన్​కి చెందిన ఎరికా లస్ట్​ అనే మహిళకు బార్సిలోనా (స్పెయిన్)లో అడల్ట్​ ఎంటర్​టైర్మెంట్​ కంపెనీ ఉంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, ప్రొడక్టివిటీని పెంచేందుకు కంపెనీలో ఈ పాలసీని ప్రవేశపెట్టినట్టు ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

వాస్తవానికి కొవిడ్​ 19 సంక్షోభం సమయంలో 2021లో లస్ట్​ ఈ పాలసీని ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు మళ్లీ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అనేక వార్తాసంస్థలు ఈ పాలసీ గురించి మళ్లీ కథనాలు ప్రచురిస్తున్నా...