భారతదేశం, ఆగస్టు 12 -- హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 'తిరంగా ర్యాలీలు' నిర్వహించడంతో పాటు 40 లక్షల ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆగస్టు 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా బైక్, సైకిల్, పాదయాత్రల రూపంలో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా, ఆగస్టు 14న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు దాదాపు 10,000 మంది కళాశాల విద్యార్థులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

తెలంగాణలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని, ఇందుకోసం 40 లక్షల ఇ...