భారతదేశం, జూలై 19 -- "స్మార్ట్​ఫోన్​లు గృహోపకరణాలు, కార్లు, ట్రాక్టర్లను అప్​గ్రేడ్​ చేసుకోండి.." అంటూ ప్రభుత్వమే మీకు డబ్బులు ఇస్తే? చైనా ఇదే చేస్తోంది! ప్రత్యక్ష క్యాష్‌బ్యాక్‌ల నుంచి భారీ ట్రేడ్-ఇన్ డిస్కౌంట్ల వరకు.. వినియోగదారుల జీవితంలోని దాదాపు ప్రతి విషయంలోనూ దేశవ్యాప్త అప్‌గ్రేడ్ పథకాన్ని చైనా నిర్వహిస్తోంది. దీని ముఖ్య ఉద్దేసం ఏంటో తెలుసా? ప్రజల ఖర్చులను పెంచడం, కర్మాగారాల ఉత్పత్తిని పెంచడం, గృహాల నుంచి భారీ యంత్రాల వరకు అన్నింటినీ ఆధునికీకరించడం!

చైనా చేపట్టిన ఈ చర్య కేవలం ఫోన్ మార్పిడి పథకమే కాదు.. ఇది పూర్తి స్థాయి టెక్ రిఫ్రెష్! ప్రోత్సాహకాలకు అర్హత ఉన్నవి:

కన్జ్యూమర్​ టెక్: స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్లు.

వాహనాలు: గ్యాస్-పవర్డ్, ఎలక్ట్రిక్...