భారతదేశం, ఆగస్టు 22 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. వీధి కుక్కులను తీసుకెళ్లి స్టెరిలైజేషన్​- వ్యాక్సినేషన్​ చేసి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని ఆదేశించింది. అయితే, రేబీస్​ సోకినా, లేదా అగ్రెసివ్​గా ఉన్న వాటిని మాత్రం విడిచిపెట్టకూడదని పేర్కొంది. ఈ మేరకు.. దిల్లీ- ఎన్సీఆర్​ ప్రాంతంలోని శునకాలను శాశ్వతంగా షెల్టర్లలో పెట్టాలన్న గత తీర్పును మార్చింది.

మూగజీవులను షెల్టర్లలో పెట్టడం అమానవీయం అని భారీ ఎత్తున నిరసనలు చేసిన జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు తాజా తీర్పు ఒక విజయంగా చూస్తున్నారు!

అయితే, కుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని అత్యున్నత న్యాయస్థానం తన తాజా తీర్పు ద్వారా తేల్చిచెప్పింది. వాటికి ఆహారాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక 'ఫీడిం...