భారతదేశం, మే 1 -- సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా కొద్ది రోజుల్లోనే భారీ లాభాలు తెప్పిస్తామనే ఫేక్ మార్కెట్ ఎక్స్ పర్ట్స్ బారిన పడి చాలా మంది లక్షల్లో నష్టపోతున్నారు. ఆన్ లైన్ లో పకడ్బందీగా నకిిలీ యాప్ లను సృష్టించి ఇన్వెస్టర్లను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ లో ఇలాంటి స్కామ్ లు ఇటీవల భారీగా పెరిగాయి. అలాంటి ఒక స్కామ్ గురించి జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. అన్ని ఇన్వెస్ట్మెంట్ కుంభకోణాల్లో అత్యధికంగా బాధితులైనది 'వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్' లోనే అని ఒక ఎక్స్ పోస్ట్ లో కామత్ పేర్కొన్నారు.

వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఎలా పనిచేస్తుందో మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ 'ఎక్స్' ద్వారా నితిన్ కామత్ దశలవారీగా వివరించారు. తమ ఆన్ లైన్ ట్రేడింగ్ ప్లాట...