భారతదేశం, మార్చి 6 -- లివ్​-ఇన్​ రిలేషన్​షిప్​పై కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. దీర్ఘకాలిక లివ్​-ఇన్​ రిలేషన్​లో ఉంటే పురుషుడిపై సదరు మహిళ రేప్​ కేసు వేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో పెళ్లి వాగ్దానంతో పురుషుడు తనపై బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని మహిళ ఆరోపించడానికి వీలు లేదని పేర్కొంది. ఓ మహిళ తన 16ఏళ్ల లివ్​-ఇన్​ పార్ట్​నర్​పై వేసిన కేసు విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

దీర్ఘకాలంగా లివ్​-ఇన్​లో ఉన్నప్పుడు, లైంగిక సంబంధానికి పెళ్లి వాగ్దానం ఒక్కటే కారణం అని చెప్పలేమని, అందుకే పురుషుడిపై పార్ట్​నర్​ అత్యాచారం అభియోగాన్ని మోపలేదమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

ఓ బ్యాంక్​ మేనేజర్​తో 16ఏళ్ల పాటు లివ్​-ఇన్​ రిలేషన్​లో ఉన్న ఓ లెక్చరర్​, తనపై రేప్​ జరిగిందని కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విక...