భారతదేశం, జనవరి 10 -- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన. పుష్ప-2 సినిమా తర్వాత తన దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని చెప్పానని తెలిపారు.

ఆ తర్వాత నుంచి నన్ను ఎవ్వరూ కలవడం లేదని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలోనే మహిళ చనిపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డానని గుర్తు చేశారు. బాబు ట్రీట్మెంట్ కు కూడా తాను డబ్బులు ఇచ్చానని. ఇప్పుడు సినిమాలకు పెరిగిన ధరలకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాజాసాబ్, చిరంజీవి సినిమాల బెనిఫిట్ షో టికెట్స్ ధరలు తాను పెంచలేదని మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు సంబంధం లేదని.. ఆ మెమోలను ఎవరు చేశారో తనకు తెలియదన్నారు.

మరోవైపు ఆయనపై కొన్ని మీడియా...