భారతదేశం, జనవరి 23 -- రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు సిట్ విచారణకు హాజరుకాగా. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. ముందుకు తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయన. పార్టీ నేతలను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

"గత పదిహేనేళ్లుగా నేను నా రాష్ట్రం కోసం పని చేశాను. మా నాయకులు మాకు ఏ బాధ్యత అప్పగించినా మేము శక్తివంచన లేకుండా నిబద్ధతతో పనిచేశాం. మేము ఎప్పుడూ టైంపాస్ రాజకీయాలు చేయలేదు. ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించలేదు. గత రెండేళ్లుగా చూస్తుంటే ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ...