భారతదేశం, ఏప్రిల్ 29 -- భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం, ఏప్రిల్ 29న తన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై దాడి చేసి 26 మంది ప్రాణాలు తీసిన నేపథ్యంలో, ఉగ్రవాదులు, వారికి మద్ధతిచ్చే వారిపై భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది.

పహల్గామ్ ప్రతీకార దాడి విషయంలో సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేసే ఆ దాడి విధివిధానాలు, లక్ష్యాలు, దాడి చేసే సమయాన్ని నిర్ణయించడానికి భారత సాయుధ దళాలకు "పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ" ఉందని ప్రధాని మోదీ అన్నారని ఈ పరిణామం గురించి తెలిసిన అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ నివేదించింది.

''ఉగ...