Telangana,husnabad, మే 4 -- తెలంగాణలోని ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో..ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తాజా ప్రకటన చేశారు.

ఇవాళ హుస్నాబాద్ లో పర్యటించిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై స్పందించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమన్నారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంపైనే ఆర్టీసీ నడుస్తోందని చెప్పారు.

మే 5, 6 తేదీల్లో హైదరాబాద్ లోనే ఉంటానని.. ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. అధికారికంగా...