భారతదేశం, జనవరి 2 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముందుగా మూసీ ప్రక్షాళనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. అయితే సీఎం ప్రసంగంపై మాట్లాడే అవకాశం తమకు కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.

స్పీకర్ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు. గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన. మూసీ కంపు కంటే సీఎం మాటల కంపు ఎక్కువైందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన కాదు.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలని దుయ్యబట్టారు.

"శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్...