భారతదేశం, జూలై 1 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, అపర కుబేరుడు ఎలాన్​ మస్క మధ్య విభేదాలు మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. 'వన్​ బిగ్​ బ్యూటిఫుల్​ బిల్​' ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మస్క్​ని ట్రంప్​ హెచ్చరిస్తుండగా, టెస్లా సీఈఓ గట్టి జవాబు ఇస్తున్నారు. ఈ పూర్తి వ్యవహారంపై ఇప్పుడు సోషల్​ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

ట్రంప్ తన మాజీ సలహాదారు అయిన మస్క్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మస్క్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ట్రంప్ పరిపాలన కనుక టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి మస్క్ వివిధ కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేస్తే, దక్షిణాఫ్రికాలో పుట్టిన మస్క్ "బహుశా తన వ్యాపారాలను మూసివేసి స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది," అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

"ఈవీలను ప్రజలపై రుద్దే విషయాన్ని నేను వ్యతిరేకిస్తాన...