భారతదేశం, నవంబర్ 23 -- శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్‌వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఉపరాష్ట్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.

సత్యసాయి సేవామార్గానికి ప్రతిరూపంగా నిలిచారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. ఆయన ప్రపంచం మెుత్తం ప్రేమను పంచారని గుర్తు చేశారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించారన్నారు. అనేక మందిని సేవా మార్గంలో నడిపించారని చెప్పారు. ఎంతోమందికి సత్యసాయి తాగునీరు అందించారని తెలిపారు. 'ప్రపంచ దేశాల్లో సత్యసాయి ట్రస్టు సేవలు అందిస్తోంది. లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. సత్యసాయి అనేక వైద్యాలయాలు స్థాపించి పేదలకు వైద్యం అందించారు. తమిళనాడులో తాగునీటి సదుపాయం కల్పించారు.' అని...