భారతదేశం, డిసెంబర్ 4 -- సైబర్ నేరాలను అరికట్టే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో 'సంచార్ సాథీ' మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. అయితే, సైబర్‌సెక్యూరిటీ నిపుణులు, ప్రతిపక్షాల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌ను తప్పనిసరిగా ముందే ఇన్‌స్టాల్ చేయాలన్న ఆదేశాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఈ యాప్‌కు "పెరుగుతున్న ఆమోదం" కారణంగానే ఈ ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మోడీ ప్రభుత్వం 2023 మే నెలలో 'సంచార్ సాథీ' పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా పౌరులు తమ ఐడీలకు లింక్ అయిన మొబైల్ కనెక్షన్‌లను తనిఖీ చేయవచ్చు. అలాగే మోసాలు, స్కామ్‌లు రిపోర్ట్ చేయవచ్చు, పోయిన ఫోన్‌లను ట్రాక్ చేయవచ్చు.

భారతదేశంలో పెరుగుతున్న సైబర...