భారతదేశం, డిసెంబర్ 2 -- మోసాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'సంచార్ సాథి' యాప్‌ను 90 రోజుల్లోగా అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలనే ఆదేశాలపై రాజకీయంగా, పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాన్ని తీవ్రంగా ఖండించాయి.

ఈ నేపథ్యంలో, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం దీనిపై వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న ఈ యాప్ ఐచ్ఛికం (Optional) మాత్రమేనని, వినియోగదారులు దాన్ని తమ పరికరాల నుంచి తొలగించుకునే వెసులుబాటు ఉందని తెలిపారు.

"... మీకు 'సంచార్ సాథి' వద్దు అనుకుంటే, దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఐచ్ఛికం. ఈ యాప్‌ను ప్రజలకు పరిచయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే, దీన్ని తమ ఫోన్లలో ఉంచుకోవాలా లేదా అన్నది పూర్తిగా ...