భారతదేశం, మార్చి 2 -- బంగ్లాదేశ్‌లో అధికారం మారినప్పటి నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లోనే ఉంటున్నారు. హసీనాను వెనక్కి పంపాలని మహ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్‌కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు షేక్ హసీనాను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, నెల లేదా ఒకటిన్నర నెలల్లో విచారణ ప్రారంభమవుతుందని బంగ్లాదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తాజుల్ హుస్సేన్ తెలిపారు. హసీనాపై సాధారణ హత్య కేసులు లేవు అని, ఆమెను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నాలు ప్రారంభించిందని ఆయన తెలిపారు.

ఇంటర్ పోల్ ద్వారా హసీనాను తిరిగి బంగ్లాదేశ్ కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మహ్మద్ తాజుల్ హుస్సేన్ అన్నారు. ఈ విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశారు. హసీనా సహా కొన్ని...