Hyderabad, జూలై 11 -- శివుడు ఎప్పుడూ జపం చేస్తూనే ఉండేవాడు. పార్వతీ దేవికి అర్థం కాలేదు. "ఎప్పుడూ ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉంటారు. ఎంతో ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఉంటారు. అదేమిటో తెలుసుకొని, అటువంటి మంత్రాన్ని 'నాకు కూడా ఉపదేశించమని అడగాలి!' అని మనస్సులో నిర్ణయించుకుంది," అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఒక రోజు పరమేశ్వరుడిని సమీపించి, "పరమేశ్వరా! కోరికల్ని తీర్చేది, పాపాలను నశింపజేసేది, తరగని జ్ఞానానందాన్ని పంచేది, పరమాత్మ దర్శనం చేయించగలిగే ఒక గొప్ప మంత్రాన్ని నాకు ఉపదేశిస్తారా?" అని భక్తితో అడిగింది, అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆమె అడిగినది విని, సంతోషంతో పరమేశ్వరుడు, "పార్వతీ! నువ్వు సర్వజగత్తుకు తల్లివి.

ఏదైనా కావాలి అని అడిగావంటే, అది లోకంలో అంద...