Andhraprafesh, జూలై 11 -- హిందీ భాషపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాపారాలకు మాత్రం హిందీ కావాలి. నేర్చుకోడానికి మాత్రం హిందీతో ఇబ్బందేంటి..? అని ప్రశ్నించారు. హిందీ మనది అనడంలో సిగ్గు ఎందుకు? అని నిలదీశారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ప్రతీ భాషా జీవ భాష, మాతృ భాషగా ఉంటుందని, కానీ హిందీ మటుకు రాజ్య భాష అని చెప్పుకొచ్చారు.

"ఒక బెంగాలీ గీతం జాతీయ గీతం అయ్యింది. ఒక పంజాబీ భగత్ సింగ్ దేశం కోసం పోరాడే విప్లవకారుడు అయ్యాడు. రాజస్థాన్ కి చెందిన రాణప్రతాప్ సౌర్యానికి చిహ్నం అయ్యాడు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఇండియా అయ్యారు. మద్రాస్ ప్రెసిడెన్సీ, ద్రవిడ ...