భారతదేశం, జనవరి 3 -- గ్రామీణ ప్రాంత నిరుపేదల ఉపాధి హామీకి తీవ్ర విఘాతం కలిగించే 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (గ్రామీన్) వీబీ-జి రామ్ జీ చట్టం 2025' ను నిర్ద్వందంగా తిరస్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ చట్టాన్ని తరిస్కరించి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

VBGRAMG చట్టాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాల్గొని తీర్మానానికి మద్దతు తెలియజేస్తూ వీబీ-జి రామ్ జీ చట్టం వల్ల గ్రామీణ ప్రాంత పేదలకు కలిగే నష్టాలను వివరించారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజల తరఫున వ్యతిరేకిస్త...