భారతదేశం, నవంబర్ 21 -- ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపించింది. మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకుని. క్రూరంగా హత్య చేశారని ఓ ప్రకటనలో పేర్కొంది.

మారేడుమిల్ల ఎన్ కౌంటర్లకు నిరసనగా నవంబర్ 23వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఓ లేఖ విడుదలైంది. పోలీసుల చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్ కౌంటర్ ...