Telangana,hyderabad, జూన్ 26 -- ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన తరగతి గదులను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నత ప్రమాణాలతో తెలంగాణ‌లో విద్యా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌న్నారు.

విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్షించారు. జిల్లాల్లో అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాల‌ల నుంచి 48 వేల మంది విద్యార్థులు ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో చేరార‌ని అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు.

పెరిగిన విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా నూత‌న గ‌దులు నిర్మించాల‌ని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న పిల్ల‌ల‌కు అందుకు అనుగుణంగా పాఠశాలల్లో వ‌స‌తులను క‌ల్పించేందుకు చ‌ర్య‌లు త...