Delhi, సెప్టెంబర్ 4 -- భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అధిగమించేందుకు కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం సాయం కోరింది. రూ.16,732 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కూడా ఉన్నారు.

ఖమ్మం, చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి రూ.11,713 కోట్ల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గుర్తు చేశారు. అయితే సాధారణ కేటాయింపులు మినహా ఇప్పటి వరకు ప్రత్యేక నిధులు విడుదల కాలేదన్నారు. దీంతో పునరావాస పనులకు ఆటంకం కలుగుతోందని అమిత్ షాకు వివరించారు.

ఇక ఆగస్టు 25 నుంచి 28 తేదీల్లో కురిసిన అకాల వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వరదలు వచ్చాయని...