భారతదేశం, సెప్టెంబర్ 8 -- పిల్లలను పెంచడం అంటే కేవలం వారి కోరికలు తీర్చడం మాత్రమే కాదు, వారికి సరైన మార్గాన్ని చూపించడం కూడా. కొన్నిసార్లు, వారి భద్రత, మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు "వద్దు" అని చెప్పక తప్పదు. అయితే ఈ ఒక్క మాటను ఎలా చెప్పామన్న దానిపై పిల్లల స్పందన ఆధారపడి ఉంటుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

"వద్దు" అనే మాట చాలా కఠినంగా అనిపించవచ్చు. అది పిల్లలను నిరాశపరుస్తుందని లేదా బాధపెడుతుందని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ "వద్దు" అని చెప్పడం తిరస్కరించడం కాదని, సరైన పద్ధతిలో, మృదువుగా చెప్పినప్పుడు అది ప్రేమతో కూడిన ఒక చర్యేనని ప్రముఖ సైకోథెరపిస్ట్, గేట్‌వే ఆఫ్ హీలింగ్ ఫౌండర్ డాక్టర్ చాందినీ తుగ్నైత్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో చెప్పారు. సరిహద్దులు నిర్ణయించడం ద్వారా పిల్లలకు గౌరవం, ఓర్పు, ఆత్మవిశ్వాసం అలవడతాయని, ఇవి వార...