భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ మంగళవారం 54 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయనకు ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

'శ్రీ పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. లెక్కలేనన్ని మంది హృదయాల్లో, మనసుల్లో ఆయన ఒక ముద్ర వేశారు. సుపరిపాలనపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏను బలోపేతం చేస్తున్నారు. ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను.' అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్‌కు చాలామంది ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడు జనసేనాని బర్త్ డేన...