భారతదేశం, నవంబర్ 5 -- రోడ్లు బాగుంటే మరిన్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చేవెళ్ల లోక్ సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మన్నెగూడ, పరిగి మీదుగా వెళ్ళే హైదరాబాద్-బీజాపూర్ (కర్ణాటక) రహదారిలోని తెలంగాణ భాగంలో భూసేకరణ పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని.. ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

"ఈ రోజుల్లో రోడ్లు ఎంత ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి. వాహనాలు నెమ్మదిగా వెళ్లి. తక్కువ ప్రమాదాలు జరుగుతాయి. రోడ్లు ఎంత మెరుగ్గా ఉంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయి "అని ఆయన పేర్కొన్నారు.

చేవెళ్ల రహదారిని నిజాం కాలంలో నిర్మించారని. అప్పటి పాలకులు వేసవి కాలంలో అనంతగిరి కొండలకు వెళ్లడానికి దీనిని ఉపయోగించారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ...